ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది – చంద్రబాబు

Friday, February 19th, 2021, 01:05:32 PM IST

Chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఎస్సీల పై రాళ్ళదాడి ఫ్యాక్షన్ పాలన కి నిదర్శనం అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం అని గుంటూరు జిల్లా పెదకూరపాడు లోని లింగాపురం లో ఎస్సీ ల పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎస్సీలు రాజకీయాల్లోకి వచ్చి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అంటూ సూటిగా ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యం లో స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది అని అన్నారు. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలి అని వ్యాఖ్యానించారు. స్వేచ్చాయుత వాతావరణం లోఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లోనూ ప్రజా మద్దతు తమకే ఉందని ప్రకటించడం సిగ్గు చేటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల వారి పట్ల దాడులు దిగడం పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే దాడులు చేసిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలని తెలిపారు.