బాబు వార్నింగ్ ను ఏమాత్రం సీరియస్ గా తీసుకోని వైకాపా.!

Wednesday, August 5th, 2020, 07:58:47 AM IST

ఏపీలో మూడు రాజధానులు అంశం ఏ స్థాయిలో రచ్చ లేపుతుందో అందరికీ తెలిసిందే. దీనితో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని టీడీపీ మార్చి తీరుతామని వైసీపీ కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఈ విషయంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా తన స్టాండ్ ఏంటో తెలిపారు. 48 గంటల డెడ్ లైన్ ఇస్తున్నాను ఈ లోపు అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం మళ్లీ ఎన్నికలకి వచ్చే దమ్ముందా అంటూ ఛాలెంజ్ చేశారు.

అయితే ఈయన చెప్పిన మాటలు బాగానే ఉన్నా అసలు ఈ ఛాలెంజ్ ను పట్టించుకునే నాధుడే లేకపోయాడు. పైగా వైసీపీ వారు ఈ ఛాలెంజ్ ను సవాలుగా స్వీకరించలేనే లేదు. తాజాగా మళ్లీ 12 గంటలు సమయం మాత్రమే ఉందని హెచ్చరించారు. దాన్ని కూడా పట్టించుకోలేదు. దీనితో ఈ ఛాలెంజ్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోయింది.