వీధి దీపాల పై పన్ను వేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నాడు – చంద్రబాబు

Friday, March 5th, 2021, 09:44:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో పెట్టక పోగా, ఇంటి పన్ను, చెత్త పై పన్ను, వీధి దీపాల పై పన్నులు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ను గెలిపిస్తే పాత పన్ను బకాయిలు పూర్తీ గా రద్దు చేస్తామని, కట్టబోయే పన్నులను సగానికి కుదిస్తాం అని, నగరాభివృద్ధి కి కృషి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.

అయితే రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ పాలన విధానం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసే అవకాశం ఉంది. వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతానికి పైగా విజయం సాధించినప్పటికీ టీడీపీ కీలక ప్రాంతాల్లో గెలుపొంది ప్రజా పార్టీ అని నిరూపించుకుంది.