సీఎం జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు – చంద్రబాబు

Monday, February 15th, 2021, 03:53:28 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో తెలుగు దేశం పార్టీ నేతలు వైసీపీ పై వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కి నిరసన గా ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపు ఇచ్చారు. అయితే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు చేపట్టాలని నేతలకు సూచించారు. అయితే ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను కాపాడుకొనేందుకు ఎలాంటి పోరాటానికి అయిన సిద్దం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు.అయితే ఈ పరిశ్రమ ను ప్రభుత్వ రంగం లో కొనసాగించే వరకూ టీడీపీ విశ్రమించదు అని అన్నారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న కేసులు మాఫీ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కి కూడా బాటలు వేసి నిర్వీర్యం చేస్తున్నారు అని బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి కి వెన్నెముక లా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రత్యక్షంగా 40 వేల మంది, పరోక్షంగా 50 వేల మందికి నీడ నిచ్చింది అని అన్నారు.