వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయం – చంద్రబాబు

Saturday, August 29th, 2020, 03:00:19 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఒక వైపు కరోనా, వరదలు, మరొక వైపు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తో ప్రజలకు కష్టాలు అంటూ ఘాటు విమర్శలు చేశారు. గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద నీటి నిర్వహణ లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జలసంఘం చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వరద బాధితుల పై రాజకీయ వివక్ష చూపడం హేయమని అన్నారు. ప్రభుత్వ పరిహారం అందించడం లో కూడా పార్టీ లని చూస్తారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం లో ఇపుడు ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. అంతేకాక వంద శాతం సబ్సిడీ పై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలని కోరడం జరిగింది.