నమ్మక ద్రోహాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం – చంద్రబాబు

Monday, October 12th, 2020, 02:47:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని అమరావతి అంశం పై తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు అని తెలిపారు. అయితే ఈ ఉద్యమం లో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులు అయ్యారు అని అన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడం లేదు అని విమర్శించారు. అమరావతి అనేది అయిదు కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్ కు ఆయువు పట్టు అని చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.

అంతేకాక అటువంటి రాజధాని ను కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలు గా మన అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మక ద్రోహాన్ని ప్రశ్నించక పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడుదాం అని చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఇది చారిత్రాత్మక అవసరం అంటూ పేర్కొన్నారు.