అంగళ్ళులో బడిపిలుస్తుంది

Wednesday, November 5th, 2014, 03:25:43 PM IST


ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు గ్రామంలో బడిపిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగళ్ళు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత వైద్యశిభిరాన్ని ప్రారంభించారు. అనతరం స్కూల్ పిల్లలతో మాట్లాడారు. వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.

బడిపిలుస్తుంది కార్యక్రమం ద్వారా అందరిలో చైతన్యం తేవడమే తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. వైద్యులు, ఇంజినీర్లు, ఏఐఎస్ ఆఫీసర్లు, రాజకీయనేతలు కావాలని పిల్లలు కలలు కనాలని..అన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన తెలిపారు. సాంకేతిక విద్యపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.