వారికి క్షమాపణ చెబుతున్నా – చల్లా ధర్మారెడ్డి

Tuesday, February 2nd, 2021, 02:06:59 PM IST

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి వారికి క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల పై విమర్శలు చేస్తూ రాముడు విషయం లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారు చేసి చందాలు వసూలు చేస్తున్నారు అని ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికే బీజేపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తూ మాటలతో ఎదురుదాడికి దిగారు. నేడు పలు చోట్ల మౌన నిరసన ప్రదర్శన కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడి చల్లారాక ముందే మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కులం ఆఫీసర్ల కి అక్షరం ముక్క రాదు అని,ఎక్కడ చూసినా వాళ్ళే అని, మొత్తం నాశనం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఓసీ జేఏసీ సభలో ఇలా వ్యాఖ్యలు చేయడం తో ఒక్క సారిగా ఎస్సీ, ఎస్టీ, బీసి, ఓ బీసీ మరియు మైనారిటీ సంఘాలు ఎమ్మెల్యే తీరును తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు చోట్ల ఆయన దిష్టి బొమ్మలు సైతం దహనం చేశారు. అయితే దీని పై ఆయన యూ టర్న్ తీసుకున్నారు. ఆయన చేసిన మాటల వివాదాస్పదం అవ్వడం తో, పలు వ్యాఖ్యలు చేశారు. తను చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు అని,ఒకవేళ ఎవరి మనసు అయినా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే పై బీజేపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యం లో అధికార పార్టీ కి చెందిన నేత ఇలా మాట్లాడటం పట్ల సర్వత్రా చర్చంశనీయంగా మారింది.