ఉద్యోగాల పై శ్వేత పత్రం విడుదల చేయండి

Monday, December 14th, 2020, 01:32:17 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం లో ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గానూ పలువురు నేతలు స్పందిస్తున్నారు. అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం శుభ పరిణామం అని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. అయితే ఉద్యోగాల సత్వర భర్తీ కి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరితగతిన ఖాళీల భర్తీ కి చిత్తశుద్ది తో కృషి చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే సీఎం కేసీఆర్ దీని పై ప్రకటన ఇచ్చిన మేరకు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక నిరుద్యోగ భృతి చెల్లింపునకు తక్షణమే చర్యలు చేపట్టాలి అని సూచించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన అనంతరం నుండి నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలపడం, అందుకు తగు విధంగా సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.