ప్రస్తుత ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా దాదాపు ఈ ఏడాది మార్చి ఆఖరి నుంచి లాక్డౌన్ విధించుకుని ఆ తర్వాత పరిస్థితులను బట్టి నెమ్మదిగా ఆంక్షలను తొలగిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని, ప్రజలంతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఇటీవల ప్రధాని మోదీ మరోసారి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారని, వ్యాక్సిన్లు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పంపిణీకి సిద్దంగా ఉండాలని అన్ని రాష్టాలకు కేంద్రం తాజాగా లేఖ రాసింది. ఇందుకోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దాదాపు ఒక సంవత్సరం పాటు జరిగే టీకా పంపిణీ ప్రక్రియను ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతోనే మొదలుపెడతామంది.