ఏపీ సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరం ప్రత్యేక ఖాతాకు నిధులు..!

Saturday, December 12th, 2020, 11:10:47 AM IST

ఏపీ సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ రూ. 2,234 కోట్లను జమచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్‌ చేస్తూ ఈ నిధులను ఎన్‌డబ్లూడీఏ విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.17,665 కోట్లు ఖర్చు చేసింది. అందులో 2014 ఏప్రిల్ 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.12,529 కోట్లను ఖర్చు చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు కేంద్రం రూ.8,507 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్‌ చేసింది. ఇప్పుడు తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234 కోట్లను జమచేయడంతో మొత్తం కేంద్రం ఇప్పటివరకు రూ.10,741 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్‌ చేసింది. అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ.1787 కోట్లు బకాయి పడినట్టు తెలుస్తుంది.