కరోనా వైరస్ నుండి కోలుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Thursday, November 12th, 2020, 10:22:16 AM IST

దేశం లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 28 న బీహార్ లోని ఎన్నికల ర్యాలీ లో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారికి కరోనా వైరస్ సోకిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని మంత్రి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తను కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా, అందులో నెగటివ్ వచ్చింది అని, అయితే తాను కరోనా వైరస్ నుండి కోలుకోవాలని కోరుతూ ప్రార్దన లు చేసిన ప్రతి ఒక్కరికీ కూడా కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అయితే కేంద్ర మంత్రి కి కరోనా వైరస్ నెగటివ్ రావడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.