బ్రేకింగ్: కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

Thursday, October 8th, 2020, 09:47:35 PM IST


కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ (74) కన్నుమూశారు. గత కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన గురువారం నాడు కన్నుమూశారు. అయితే ఈ విషయాన్ని ఆయన కుమారుడు అయిన చిరాగ పాశ్వాన్ వెల్లడించారు. ఇటీవల రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ లో గుండె కి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. భారత దేశం లోనే అత్యంత ప్రసిద్ధ దళిత నాయకుల్లో రామ్ విలాస్ పాశ్వాన్ ఒకరు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారు.

గుండె సంబంధిత ఇబ్బందులతో గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.అయితే లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఇలా అన్నారు. పాపా మీరు ఇప్పుడు ఈ ప్రపంచం లో లేరు కానీ, మీరు ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడూ నాతోనే ఉంటారని తెలుసు అని, మిస్ యూ పాపా అని పేర్కొన్నారు. 1969 లో ఆయన సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానం ప్రారబించారు.

దాదాపు అయిదు దశాబ్దాలు రాజకీయాల్లోనే ఉన్నారు. వాజ్ పాయ్ నేతృత్వంలో సైతం మంత్రి గా పనిచేశారు. 1975 లోక్ దళ్ స్థాపించాకా అందులో చేరిన రాంవిలాస్, 1975 లో ఎమర్జెన్సీ ను వ్యతిరేకించి జైలు కి వెళ్లి వచ్చిన అనంతరం 1977 లో అత్యధిక మెజారిటీ తో ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2000 సంవత్సరం లో లోక్ జనశక్తి పార్టీ ను స్థాపించారు. ఈయన మరణం పట్ల ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.