సీఎం కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ…ఏమన్నారంటే?

Sunday, September 13th, 2020, 11:00:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాశారు. అయితే హైదరాబాద్ లో తక్షణమే తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు కి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, నిజాం నియంతృత్వ పాలన పై జరిగిన పోరాటం తెలిసిన వారీగా, స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు కి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు అని ఆశిస్తున్నా అని కిషన్ రెడ్డి తెలిపారు.

భారత దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఉన్నాయి అని, అలానే తెలంగాణ విమోచన చరిత్ర ఎంతో ప్రత్యేకం అయింది అని లేఖ లో స్పష్టం చేశారు. 1947 ఆగస్ట్ 15 న దేశం మొత్తం స్వేచ్ఛ వాయువులు పీల్చినప్పుటికీ నాటి నిజాం పాలన లో హైదరాబాద్ సంస్థానం అంటూ గుర్తు చేశారు. ప్రస్తుత తెలంగాణ లో నాడు మువ్వన్నెల జెండా ఎగురలేదు అని, తెలంగాణ ప్రజలను అనేక కష్ట నష్టాలకు గురి చేసిన నిజాం ను గద్దె దింపి హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించడం లో ఎంతో మంది మహనీయుల పాత్ర ఉంది అని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వివరిస్తూ సీఎం కేసీఆర్ కు మంత్రి కిషన్ రెడ్డి లేఖ లో స్పష్టం చేశారు.