పోలవరం నిధుల విడుదల విషయంలో ఎలాంటి సమస్య లేదు!

Monday, February 8th, 2021, 01:30:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అంశం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పోలవరం కి సంబంధించిన నిధుల మంజూరు అంశం పై ప్రస్తావిస్తూ రాజ్యసభ లో పలు వ్యాఖ్యలు చేశారు.2022 వరకూ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే యోచన లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. అయితే నిధుల విడుదల లో ఆలస్యం కారణం గా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి అని, నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి అంటూ కోరడం జరిగింది. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ ఒక స్పష్టత ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల కి ఎలాంటి సమస్య లేదు అని అన్నారు.2013-14 ధరల ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నోట్ జరిగింది అని స్పష్టం చేశారు. అయితే దీని పై రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017 లెక్కల ప్రకారం అంచనాలను తయారు చేసింది అని చెప్పుకొచ్చారు. వీటిని పరిశీలించిన అనంతరం కేబినెట్ నిర్ణయం కి పంపుతామని, సవరించిన అంశాల పై ముందుకు వెళ్తామని ప్రకటించారు.