అమిత్ షా కి కరోనా నెగటివ్…ట్వీట్ డిలీట్ చేసిన ఎంపీ మనోజ్ తివారీ

Sunday, August 9th, 2020, 07:00:14 PM IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి కరోనా నెగటివ్ అంటూ తాజాగా వార్త చక్కర్లు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం పై కేంద్ర హోం శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. అమిత్ షా కి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించలేదు అని స్పష్టం చేశారు. ఒక వేళ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపితే తప్పకుండా వివరాలను వెల్లడిస్తామని హోం మంత్రి శాఖ కి చెందిన ఒక అధికారి వెల్లడించారు. అయితే అమిత్ షా కి కరోనా నెగటివ్ అంటూ అసత్య వార్తలు ప్రచారం చేయొద్దు అని అందరికీ సూచనలు చేశారు.

అయితే తాజాగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, అమిత్ షా కి కరోనా వైరస్ నెగటివ్ అంటూ సోషల్ మీడియా లో ట్వీట్ చేసారు. అయితే తాజాగా హోం మంత్రి శాఖ అధికారుల వివరణ తో ఎంపీ ట్వీట్ ను డిలీట్ చేయడం గమనార్హం. కాగా ఈ నెల 2 వ తేదీన అమిత్ షా తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.