కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న అమిత్ షా!

Sunday, August 9th, 2020, 02:30:26 PM IST

amit shah

దేశ ప్రజలను తీర్వ ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ తన ఉగ్ర రూపం దాల్చుతోంది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం కరోనా వైరస్ భారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 2 వ తేదీన ఈ విషయాన్ని వెల్లడించిన అమిత్ షా తాజాగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కి చెందిన ఎంపీ మనోజ్ తివారీ తెలిపారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో కరోనా వైరస్ నెగటివ్ వచ్చినట్లు తెలిపారు.

అయితే గురుగ్రాం లోని మేదంతా ఆసుపత్రి లో చికిత్స తీసుకున్న అమిత్ షా కరోనా వైరస్ భారీ న పడి కోలుకోవడం తో డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ పెరుగుతోంది. వేల మంది కరోనా వైరస్ భారిన పడి అనారోగ్యం పాలు అవుతుండగా, వందల సంఖ్యలో బాధితులు మృతి చెందుతున్నారు. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా నే ఉంది అని నిపుణులు అంటున్నారు.