టీకా తీసుకుంటే నపుంసకులవుతారు…ఖండించిన కేంద్ర ఆరోగ్య శాఖ

Friday, January 15th, 2021, 12:35:30 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభించనున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో కరోనా వైరస్ టీకా పై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ టీకా తీసుకోను అని ఇప్పటికే తెలిపారు. తాజాగా ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ మరొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ అశుతోష్ సీన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం కేంద్రం లో, రాష్ట్రం లో అధికారం లో ఉన్న బీజేపీ ను నమ్మం అంటూ వ్యాఖ్యానించారు.

అఖిలేష్ యాదవ్ వాక్సిన్ తీసుకోను అంటే వాక్సిన్ విషయం లో ఆయనకి వాస్తవాలు తెలిసి ఉంటాయి అని నా నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు. వాక్సిన్ ప్రజలకు హాని చేస్తుంది అని, కోవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులు అవుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కేవలం తమ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా టీకా కి దూరంగా ఉండాలి అంటూ సూచించారు. అయితే ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ వ్యవహారం పై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కరోనా టీకా కారణంగా మహిళలు కానీ, పురుషులు కానీ అలా నపుంసకులు అవుతారు అని శాస్త్రవేత్తలు చెప్పలేదు అని, ఇందుకు సంబంధించిన ఆధారాలు లేవు అని, ఇలాంటి ఊహాగానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. టీకా వేయించుకున్న అనంతరం కొంతమంది లో స్వల్ప జ్వరం, టీకా వేసిన ప్రాంతంలో కొంచెం నొప్పి అని అన్నారు, ఇతర టీకాల లాగానే ఇది కూడా ఉంటుంది అని అన్నారు.