తెలంగాణకు రానున్న కేంద్ర బృందం.. కరోనా కేసులపై ఆరా..!

Monday, August 10th, 2020, 09:00:21 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సల వివరాలను తెలుసుకునేందుకు నేడు కేంద్ర బృందం ఢిల్లీ నుంచి వస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ నేపధ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తుండడంతో దీనిపై కూడా కేంద్ర బృందం అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలను కూడా పరిశీలించనుందని సమాచారం. అయితే గతంలో తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం ఇప్పుడు ఎలాంటి నివేదిక, సూచనలు ఇవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది.