వారిపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు..!

Saturday, November 7th, 2020, 01:04:40 AM IST

YS_Jagan
ఏపీలో క్రిస్టియన్లుగా మతం మారి చాలా మంది ఎస్సీ, ఓబీసీ వర్గాల ప్రతిఫలాలను పొందుతున్నారు. అయితే దీనిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మతం మారినప్పటికి నకిలీ ఓబీసీ, ఎస్సీ సర్టిఫికెట్లు పొంది విపత్తు ఉపశమన నిధి నుంచి రూ.5 వేల రూపాయల ప్రతిఫలాలను పొందుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇదిలా ఉంటే ఏపీలో పాస్టర్లకు 5 వేలు ఇవ్వడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్‌ ఫోరం ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5 వేలు ఆర్థిక సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నగదును అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్‌లకు ఇవ్వాలని నిర్ణయించింది. గుర్తింపు పొందిన మసీదు వారికే కాకుండా, గుర్తింపు పొందని వారికి కూడా ఇవ్వాలని ఆదేశాలలో పేర్కొంది.