మాకు సంబంధం లేదు.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ..!

Thursday, August 6th, 2020, 03:10:33 PM IST

AP_Capital

ఏపీ రాజధాని అంశంపై గత కొద్ది రోజుల నుంచి నెలకొన్న వివాదంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ హైకోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది.

ఈ నేపధ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని అఫిడవిట్ దాఖలు చేయగా, దీనికి కేంద్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది.