టిక్‌టాక్ యాప్‌ని నిషేధించిన కేంద్రం.. మరో 58 యాప్స్ కూడా..!

Monday, June 29th, 2020, 09:59:37 PM IST

టిక్‌టాక్ యాప్‌ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకొని టిక్‌టాక్‌ సహా మరో 58 యాప్‌లపై నిషేదం విధించింది.

అయితే ఇటీవల చైనాతో గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన ఓ కల్నల్‌ సహా 20 మందికి జవాన్లు మృతువ్యాత పడిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు చెందిన వస్తువులను, యాప్‌లను వినియోగించొద్దని, వాటిని బ్యాన్‌ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే ఈ మేరకు కేంద్రం కూడా చైనాకు సంబంధించిన యాప్‌ల్‌పై నిషేదం విధిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం నిషేధించిన యాప్స్‌ జాబితా