కేంద్రం మరొక కీలక నిర్ణయం…భారత్ లో పబ్జీ బ్యాన్!

Wednesday, September 2nd, 2020, 11:13:38 PM IST

చైనా బోర్డర్ లో చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. చైనా యాప్ ల ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జి తో సహా 118 చైనా యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. చిన్న పిల్లల్లో నేర ప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటం తో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ను నిషేదించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ యాప్ లని గూగుల్ మరుట్ యాపిల్ ప్లే స్టార్ ల నుండి తొలగించి వేయడం జరిగింది.

అయితే పబ్జి తో పాటుగా బైడు, క్యామ్ కార్డ్, విచాట్ రీడింగ్ పలు ప్రముఖ యాప్ లను నిషేధించడం తో చైనా కి గట్టీ దెబ్బ తగిలిందని తెలుస్తోంది. పబ్జి ను కొన్ని కోట్ల మంది భారతీయులు డౌన్ లోడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పిల్లలలో నేర ప్రవృత్తి పెరిగేలా ఈ యాప్ ఉండటం తో దీని పై న్యాయ స్థానాల్లో పలు ఫిర్యాదులు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.