థియేటర్ల లో నూరు శాతం ఆక్యుపెన్సీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!

Sunday, January 31st, 2021, 03:12:45 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా దేశం లో కొనసాగుతూనే ఉంది. గతేడాది తో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు కొంతమేరకు మారాయి. అయితే సినిమాలు విడుదల లేకపోవడం తో థియేటర్లు చాలా వరకు లాక్ డౌన్ కాలం లో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇటీవల అక్టోబర్ లో 50 శాతం ఆక్యూ పెన్సి తో థియేటర్ల ను పునః ప్రారంభం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా 100 శాతం ఆక్యుపెన్సి తో ధియేటర్లని ప్రారంభించవచ్చు అంటూ నిర్ణయం తీసుకుంది.అయితే ఇందుకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి వంద శాతం ఆక్యు పెన్సీ తో మల్టిప్లెక్స్, థియేటర్లు తెరుచుకోవచ్చు అని, టికెట్ కౌంటర్ ల వద్ద వెలుపల ఆరు అడుగుల ఖచ్చిత దూరం పాటించాలి అని, ధియేటర్ సిబ్బంది మరియు ప్రేక్షకులు ఖచ్చితంగా మాస్క్ లని ధరించాలి అని తెలిపింది అంతేకాక శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఎంట్రీ వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి అని, హ్యాండ్ వాష్, సనిటైజర్ లను అందుబాటులో ఉంచాలి అంటూ పేర్కొంది. అంతేకాక హలు లో 24 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంచాలి అంటూ పేర్కొంది. అయితే కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల తో మళ్ళీ థియేటర్లు వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకొనున్నాయి.