బిగ్ న్యూస్: కరోనా కేసుల కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం సూచనలు!

Sunday, March 28th, 2021, 03:02:16 PM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి ఇప్పటికే కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశం లో అత్యధికంగా ఎక్కువగా కేసులు నమోదు అవుతుంది మహారాష్ట్రలోనే. దాదాపు 59.8 శాతం పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రానికి చెందిన జిల్లాల్లోనే నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అయిన రాజేష్ భూషణ్ 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకి చెందిన కలెక్టర్లు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ నిబంధనల విషయం లో రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మాస్క్ లు, సామాజిక దూరాలు లాంటి కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కరోనా సోకిన ఒక వ్యక్తి నుండి ముప్పై రోజుల్లో 406 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే 90 శాతం మరణాలు 45 ఏళ్లు పైబడిన వారిలో సంభవిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే మాస్కు ల పట్ల 90 శాతం మంది ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ 44 శాతం మందే ధరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే నిబంధనలు ఉల్లగించిన వారికి భారీ జరిమానా లు విధించాలి అని అన్నారు.