కరోనా వైరస్ స్ట్రెయిన్: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

Tuesday, December 22nd, 2020, 06:35:45 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న సమయం లో ఇప్పుడు అంతకంటే ప్రాణాంతక కరోనా వైరస్ స్ట్రెయిన్ వచ్చింది. బ్రిటన్ కేంద్రం గా ఈ మహమ్మారి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ వైరస్ తో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఎపిడెమియోలాజికల్ నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక నిబంధనలను విడుదల చేసింది. అయితే బ్రిటన్ నుండి వచ్చే విమానాల పై ఆంక్షలు విధించింది. అయితే ఇటీవల యూ కే నుండి వచ్చిన వారిని కనిపెట్టే పనిలో నిమగ్నం అయింది. అంతర్జాతీయ విమానాశ్రయాలలో బ్రిటన్ నుండి వచ్చిన వారికి ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది.

అయితే నవంబర్ 25 వ తేదీ నుండి డిసెంబర్ 8 వ తేదీ వరకు యూ కే నుండి భారత్ కి వచ్చిన ప్రయాణికులను గుర్తించాలని సూచించారు. అలానే విదేశాల నుండి రాష్ట్రాలకు వచ్చిన వారి వివరాలు, 14 రోజుల ట్రావెల్ హిస్టరీ తో పాటుగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు. అయితే నెగటివ్ వచ్చినా ఐసోలేషన్ లో ఉండాలి అని సూచించారు. అయితే పాజిటివ్ వచినటివంటు ప్రయాణికుల శాంపిల్స్ ను ఎన్ ఐ వి పుణె కి పంపాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.