సుధాకర్ కేసు లో కుట్ర కోణం ఉంది – సీబీఐ

Tuesday, September 1st, 2020, 08:15:51 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత కొద్ది నెలల క్రితం డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ కి అప్పగించగా, ఇందులో కుట్ర కోణం దాగి ఉంది అని సీబీఐ ఉన్నత న్యాయస్థానం కి తెలియజేసింది. కేసు కొలిక్కి రావాలి అంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని తేల్చి చెప్పింది. అయితే ఇందుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.విచారణ కోసం సీబీఐ కి మరో రెండు నెలల సమయం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదిక ను నవంబర్ 11 న కోర్టు కి అందించాలి అని సీబీఐ ను ఆదేశించింది.

అయితే ఇందుకు సంబంధించిన తదుపరి విచారణ నవంబర్ 16కి వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వైద్యులకు తగు పి పి ఈ కిట్ లను అందించడం లేదు అని, ఈ విషయం పై బహిరంగం గా గలమెత్తడం తో ప్రభుత్వం అతనిని వీధుల నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాక అనంతరం శిరోముండనం తో కనిపించిన సుధాకర్ కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. దీని పై సీబీఐ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.