వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కి షాక్.. సీబీఐ నోటీసులు..!

Tuesday, February 2nd, 2021, 02:12:59 AM IST


వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు షాక్ తగిలింది. అయితే గతంలో హైకోర్టు తీర్పులు, జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది నవంబర్‌లో సీబీఐ 16 మందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో అధికార పార్టీ ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 6వ తేదిన విశాఖపట్నానికి రావాలని నోటీసుల్లో సూచించింది. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే విశాఖపట్టణంలోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. అయితే గతంలో సీఐడీ విచారణ సరిగా లేదని ఈ కేసు విచారణను హైకోర్ట్ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.