బిగ్ న్యూస్ : వై ఎస్ వివేకా కేసులో స్పీడ్ పెంచిన సిబిఐ.!

Saturday, August 1st, 2020, 11:32:51 AM IST

ఆంధ్ర రాష్ట్రంలో మోస్ట్ సస్పెన్స్ బుల్ కేసులలో వై ఎస్ వివేకా హత్యా ఘటన కూడా ఒకటి. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు స్వయానా చిన్నాన్న అయినటువంటి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యా ఉందంతం ఏడాది దాటేసినా సరే ఇంకా అసలు నిందితులు ఎవరో అన్నది తెలియకపోడం దీనితో ఈ కేసును సిబిఐ వారు చేపట్టడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ కేసుకు సంబంధించి ఏ ఒక్కరినీ కూడా వదలకుండా విచారణ చేస్తున్న సిబిఐ ఇప్పుడు స్వయంగా వివేకా కుమార్తె సునీత సమక్షంలో ఆ హత్యా ఘటన జరిగిన రోజుకు ఎవరెవరికి అయితే సంబంధం ఉందో వారందరినీ ఉంచి విచారించినట్టు తెలుస్తుంది. అలాగే ఆరోజు ఘటనలో మొదట వివేకా హత్యకు గురైనట్టు చూసిన కృష్ణా రెడ్డి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబడుతున్నట్టు తెలుస్తుంది.

ఆయన మొదట ఎవరికి ఈ సమాచారం అందించారు? ఇంకా ఎవరెవరితో మాట్లాడారు అన్న విషయాలకు సంబంధించి అడిగినట్టు తెలుస్తుంది. అలాగే అదే రోజున దొరికిన కీలక లేఖకు సంబంధించి పలు ప్రశ్నలు కృష్ణా రెడ్డిను సిబిఐ వారు వివేకా కుమార్తె సమక్షంలో అడిగారట.