నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్.. సీబీఐ కేసు నమోదు..!

Friday, March 26th, 2021, 01:37:37 AM IST

Raghurama-Krishnam-Raju
నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పెద్ద షాక్ తగిలింది. అధికార పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపై, సీఎం జగన్‌పై మీడీయా ముందు విమర్శలు చేస్తూ ఉండే రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు నమోదు చేసినట్టు సమాచారం. అసలు ఆయనపై సీబీఐ ఎందుకు కేసు నమోదు చేసిందంటే ఇంద్‌ భారత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం రఘురామకృష్ణంరాజు 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని ఎస్‌బీఐ చెన్నై బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ రవిచంద్రన్‌ ఈ నెల 23న సీబీఐ్‌కి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రఘురామకృష్ణంరాజుతో సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.