బిగ్ న్యూస్: ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సిబిఐ కేసు

Friday, October 9th, 2020, 01:13:49 AM IST


నర్సాపురం నియోజక వర్గం, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. గురువారం నాడు చేసిన సోదాల్లో బ్యాంక్ లోన్ బకాయిల పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒక్క హైదరాబాద్ లోని నివాసం లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ నెల 6 న హైదరాబాద్ , ముంబై ప్రాంతాల్లో 9 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించారు. అందులో రఘురామ కృష్ణంరాజు తో సహ తొమ్మిది మంది పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది.

అయితే ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక సీబీఐ బృందం సోదాలు నిర్వహిస్తోంది. పలు కంపెనీ లకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగాయి. అయితే 2019 ఏప్రిల్ లో రఘురామ కృష్ణంరాజు కి చెందిన కంపెనీ ల్ ఈ సోదాలు జరిగాయి. అయితే పలు ప్రాజెక్ట్ లకి సంబంధించి 600 కోట్ల రూపాయల క్ పైగా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల భారీగా తీసుకున్న రుణాల కారణంగా ఇవి జరిగినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ సోదాలు జరగడం ఇది తొలిసారి కాదు అని తెలుస్తోంది.