వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ కేసులో ఏ-1గా ఉన్న సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణం రాజుకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, 11 సీబీఐ ఛార్జ్ షీట్లలో ఏ1గా ఉన్న సీఎం జగన్ విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని పిటీషన్లో పేర్కొన్నారు.
అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్ ప్రొసీడింగ్స్ సరిగా లేవని సీబీఐ కోర్టు తెలిపింది. సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే నేడు మీడియాతొ మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు నిన్న తనకు చాలా మంది ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని చెప్పుకొచ్చారు.