టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు

Friday, December 18th, 2020, 01:01:51 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీ ఐ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సీబీఐ అధికారులు ట్రాన్స్ ట్రాయ్ నిర్మాణ సంస్థ వ్యవహారాల పై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రాన్స్ ట్రాయ్ నిర్మాణ సంస్థ లో రాయపాటికి వాటాలు ఉన్నాయి అని తెలుస్తోంది. అయితే సదరు సంస్థ రుణాల ఎగవేత పై సీబీఐ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం నేపద్యం లోనే రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహించడం పట్ల పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.