5 కోట్లు కావాలి.. ఒక‌రికి జీవితాంతం ఆక్సిజ‌న్ కొనాలంటే..!

Tuesday, February 14th, 2017, 02:33:46 AM IST


మ‌నిషి వికృత చేష్ట‌ల‌కు అడ‌వులు అంత‌రించిపోతున్నాయి. ప‌చ్చ‌ద‌నం నాశ‌నం అవుతోంది. ఇష్టానుసారం ప్ర‌కృతిని నాశ‌నం చేసి పెను ప్ర‌మాదంలో చిక్కుకుంటున్నారు మాన‌వులు. అయినా ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా అదే కంటిన్యూ చేస్తున్నారు. మెజారిటీ పార్ట్ రియ‌ల్ ఎస్టేట్ పేరుతో, భ‌వంతుల నిర్మాణం పేరుతో చెట్లు న‌రికేస్తున్నారు. దీని ప‌ర్య‌వ‌సానం ఇప్ప‌టికే అనుభ‌విస్తున్నాం. శీతోష్ణ‌స్థితిలో అస‌మ‌తుల్య‌త ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది. కేవ‌లం మ‌న దేశంలో, మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ చూస్తే అప్ప‌ట్లో వైజాగ్‌ని సునామీ తుడిచిపెట్టేయ‌డం వెన‌క‌, చెన్న‌య్‌లో ప్ర‌కృతి విల‌యం సంభ‌వించ‌డం వెన‌క‌, అటుపై భారీ తుఫాన్ల‌కు తెర‌తీస్తున్న కార‌ణాలు ఇవన్నీ ప్ర‌కృతి విధ్వంస‌క‌ర ప‌నుల వ‌ల్ల‌నేన‌ని అర్థం చేసుకోవాల్సొస్తోంది.

ఒక మ‌నిషి రోజుకు మూడు ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు పీలుస్తాడు. ఒక్కో సిలెండ‌ర్ ఖ‌రీదు రూ.700 అనుకున్నా, ఏడాదికి 7.66 వేలు ఖ‌ర్చ‌వుతుంది. జీవితాంతం ఆక్సిజ‌న్ కొనుక్కోవాలంటే 5 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని లెక్క తేల్చారు. అంత ఆక్సిజ‌న్‌ని చెట్లు మ‌న‌కు ఫ్రీగా ఇస్తున్నాయి. ఈమాత్రం కామ‌న్ సెన్స్ లేకుండా వికృత చేష్ట‌ల‌కు పోయే ద‌గుల్బాజీలు మ‌నుషులు. ఇది మీకోసం లైఫ్ లైన్ ఆక్సిజ‌న్ ట్రీ…