మాజీ మంత్రి అఖిల ప్రియ పై కేసు నమోదు

Thursday, December 17th, 2020, 08:56:46 AM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ పై కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సి ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే పట్టణం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఉన్న కారణంగా కట్టడి కొరకు సెక్షన్ 30 అమలు లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెక్షన్ అమలు లో ఉన్నప్పటికీ అఖిల ప్రియ బుదవారం నాడు జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టడం జరిగింది అని తెలిపారు. అయితే వాహనాల రాకపోకలకి మరియు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడం తో అఖిల ప్రియ తో పాటుగా తెలుగు దేశం పార్టీ కి చెందిన మరి 25 మంది పై కేసు నమోదు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.