బిగ్ బాస్-2 షో పై కేసు నమోదు…చిక్కుల్లో పడ్డ హీరో ??

Friday, August 3rd, 2018, 03:26:15 AM IST

ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరు గడిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. అది షో అని తెలిసినప్పటికీ కూడా కొందరు ఈ షో పట్ల అమిత ఆకర్షితులవుతూ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లు గెలవాలని గట్టిగ కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ -2 షో పెద్ద చిక్కుళ్లనే పడ్డట్లు సమాచారం. తెలుగు మాదిరి ఆ షో లో కూడా శని ఆదివారాల్లో షోకు విచ్చేసే హోస్ట్ చేసిన చిన్న తప్పిదం వల్లనే ఈ విధంగా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ ఒక కంటెస్టెంట్ కు ఇచ్చిన టాస్క్ లో భాగంగా అతను ఒక నియంత వలె బిహేవ్ చేవలసి రావడంతో అతడు మిగతా వారితో

అలానే ప్రవర్తించడంతో దానిని ఆధారంగా చేసుకుని మాట్లాడిన హోస్ట్ కమల్ హాసన్ రాజకీయాల్లో ఒక నియంతవలె వ్యవహరిస్తే ప్రజలకు ఎటువంటి గతి పడుతుంది అనేది అతనికి జరిగిన దాన్ని బట్టి చూస్తే మనకు అందరికి అర్ధం అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో దివంగత అన్నాడీఎంకే ముఖ్యమంత్రి జయలలిత గారిని అక్కడ నియంతలా చూపి ఆమెను అవమానించేలా హోస్ట్ కమల్ మాట్లాడారని లూయిసాల్ రమేష్ అనే న్యాయవాది పోలీస్లకు షో నిర్వాహకులు మరియు హోస్ట్ కమల్ పై, మరియు షో ని ప్రసారం చేస్తున్న విజయ్ టీవీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీస్ ల నుండి ఎటువంటి సమాధానం వెలువడుతుందో వేచి చూడాలి మరి….