ఏబీ డివిలియర్స్ సలహా…నేను అదే చేశా – కోహ్లీ

Monday, March 15th, 2021, 11:55:23 AM IST

ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. కోహ్లీ మరొకసారి సూపర్ ఇన్నింగా తో విజయం సొంతం అయింది. ఈ మ్యాచ్ లో కోహ్లి 49 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లి తో పాటుగా ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ తో మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ విజయం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు.

పూర్తి సాధికారత తో బ్యాటింగ్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి అని తెలిపారు. ప్రాథమిక అంశాల పై మళ్ళీ దృష్టి సారించాల్సి వచ్చింది అని అన్నారు. తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ ఇండియా యాజమాన్యం మరియు అనుష్క చాలా విషయాలు మాట్లాడారు అని వ్యాఖ్యానించారు. తనేం చేయాలో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక మ్యాచ్ కి ముందు డివిలియర్స్ తో స్పెషల్ చాట్ చేసిన విషయాన్ని వెల్లడించారు. అతను బంతిని మాత్రమే చూసి అడమని చెప్పాడు అని, తను అదే చేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ తో రాణించడం పట్ల ప్రశంశల వర్షం కురిపించారు.