కార్మికుల శక్తితో ఎదిగిన ఉక్కు పరిశ్రమను కాపాడాలి – బుచ్చయ్య చౌదరి

Monday, February 8th, 2021, 03:08:02 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విశాఖ ఉక్కు పరిశ్రమ పై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 31, 2020 న పోస్కో దక్షిణ కొరియా కి చెందిన స్టీల్ ఉత్పత్తి సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు చర్చలు జరపడం జరిగింది అంటూ బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు. స్టీల్ ఉత్పత్తి ను వైజాగ్ లో ఏర్పాటు చేస్తామని అవసరం అయిన భూములు ఇవ్వమని కోరడం కూడా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో ఉక్కు పరిశ్రమ కార్మికులు స్ట్రైక్ కూడా నిర్వహించారు అని బుచ్చయ్య చౌదరి వివరించారు.

అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం ను వెల్లడించారు. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి లేఖలు రాతతో సరిపెట్టడం, దీని పై ఏమీ మాట్లాడక పోవడం అనేక అనుమానాలకు తావు ఇస్తోంది అంటూ బుచ్చయ్య చౌదరి వివరించారు. కార్మికుల శ్రమతో ఎదిగిన ఉక్కు పరిశ్రమను కాపాడాలి అంటూ పిలుపు ఇచ్చారు. అందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.