డిన్నర్ కి పిలిస్తే వెళ్ళింది.. చివరకు అక్కడ ఏమైందంటే..?

Saturday, April 2nd, 2016, 05:04:13 PM IST


ఆ ఇద్దరు మంచి వ్యాపార వేత్తలు. ఇద్దరికీ మంచి పరిచయాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, ఇక్కడే అసలు సమస్య వచ్చింది. పరిచయం కొద్ది పిలిచాడు కదా అని వెళ్ళింది. అలా వెళ్ళిన సదరు మహిళకు డిన్నర్ కాగానే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడట. అది తెలియక పాపం సదరు మహిళ ఆ డ్రింక్ తాగి స్పృహకోల్పోయింది. అలా స్పృహ తప్పడంతో.. ఆమెపై సదరు వ్యాపారవేత్త అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఇక స్పృహలోకి వచ్చిన ఆ మహిళ జరిగిన విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. అసలే దేశరాజధానిలో మహిళలకు రక్షణ కరువౌతున్న సమయంలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరం.