హైలెట్స్ : కేంద్ర బడ్జెట్ 2021-22 ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Monday, February 1st, 2021, 11:58:22 AM IST

*కేంద్ర బడ్జెట్ 2021-22 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొదటి సారి గా డిజిటల్ పద్దతి లో పత్రులు లేకుండా సమర్పించారు. ట్యాబ్ లో చూసి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు నిర్మలా సీతారామన్.

*ఎప్పుడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేయడం జరిగింది అంటూ నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే భారత్ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది అంటూ చెప్పుకొచ్చారు. ఫ్రంట్ వారియర్స్ చేసిన సేవలకు, అత్యవసర సేవల రంగంలో ప్రాణాలొడ్డి పని చేసిన వారిని కొనియాడారు.

*ఆర్ధిక వ్యవస్థను గాడి లో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్ లో పెట్టినట్లు తెలిపారు.

*కరోనా ను కట్టడి చేయడం తో దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్ట గలిగామని చెప్పుకొచ్చారు. వంద దేశాలకు కరోనా వాక్సిన్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని వెల్లడించారు

*ఆరోగ్య రంగానికి పెద్ద పీట…జాతీయ స్థాయిలో వ్యాధి నివారణ కేంద్రం, 15 ఎమర్జెన్సీ వెల్ నెస్ కేంద్రాల ఏర్పాటు.

*64,180 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ను పిఎం ఆత్మ నిర్భర్ భారత్ ఆరోగ్య పథకం గా ప్రవేశ పెట్టారు.

*పర్యావరణ కాలుష్యము ను అరికట్టేందుకు ప్రయత్నం..వాహన పొల్యూషన్ ను తగ్గించడం పై ప్రత్యేక దృష్టి…వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లు దాటిన అనంతరం తుక్కుకి మార్చే పథకం

*కరోనా వాక్సిన్ కోసం 35 వేల కోట్ల రూపాయలు, భారత్ తో పాటు మరో 100 దేశాలకు వాక్సిన్ సరఫరా. నాలుగు ప్రాంతీయ ల్యాబ్ ల ఏర్పాటు కి గ్రీన్ సిగ్నల్. ఆత్మ నిర్భార్ ఆరోగ్య పథకానికి 2,23,846 కోట్ల రూపాయల కేటాయింపు.

*సరుకు రవాణా కి ప్రత్యేక రైలు మార్గం, డ్రోన్ సేవలు కూడా ప్రారంభం. డెవలప్మెంట్ ఫైనాన్షియల్ సంస్థల బిల్.

*వాహనాల ఫిట్నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం, కాల పరిమితి ముగిసిన అనంతరం ఫిట్నెస్ పరీక్షకు వెళ్లాల్సిందే. జాతీయ రహదారులకి 5 వేల కోట్ల రూపాయలు. 11 వేల కిలమీటర్ల జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం కొరకు బిల్.

*ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల ఏర్పాటు 2022! జూన్ నాటికి. ఖరగ్ పూర్, విజయవాడ ల మధ్య ఈస్ట్ కాస్ట్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు.

*25 వేల కోట్ల రూపాయల తో పశ్చిమ బెంగాల్ లో రహదారుల నిర్మాణం, అస్సాం లో రహదారుల అభివృద్ధి కోసం 19 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ బిల్. కోల్కతా సిలిగురి రహదారి విస్తరణ కి గ్రీన్ సిగ్నల్

*రైల్వే మౌలిక సౌకర్యాల కొరకు 1,01,055 కోట్ల రూపాయల కేటాయింపు.

*18 వేల కోట్ల తో బస్ ట్రాన్స్పోర్ట్ పథకం, చెన్నై మెట్రో కు 63,246 కోట్ల రూపాయల కేటాయింపు. బెంగళూరు మెట్రో కి 14,788 కోట్ల రూపాయల కేటాయింపు.

*విద్యుత్ పంపిణీ రంగానికి పెద్ద పీట. 3,05,984 కోట్ల రూపాయల తో డిస్కం లకు సాయం. ఇండియన్ షిప్పింగ్ కంపెనీ కొరకు 1,624 కోట్ల రూపాయల కేటాయింపు. హైడ్రోజన్ ఎనర్జీ పై ప్రత్యేక దృష్టి, నౌకల రీ సైక్లింగ్ సామర్ధ్యం పెంపు కి చర్యలు

*ఉజ్వల పథకం తో మరో కోటి మందికి సాయం. రాష్ట్రాలు మరియు స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రెండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు.

*భీమా రంగం లో ఎఫ్ డీ ఐ లు 49 శాతం నుండి 78 శాతానికి పెంచుతూ నిర్ణయం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగం లో ప్రత్యేక సంస్కరణలు. 1938 చట్టం సవరణ, డిపాజిట్ల భీమా పెంపు నిర్ణయం.

*స్టార్టప్ లకు ప్రత్యేక ప్రత్యేక ప్రోత్సాహకాలు..పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, స్టార్టప్ లకు చేయూత కోసం ప్రోత్సాహకాలు. ఒక వ్యాపారం నుండి మరొక వ్యాపారానికి కంపెనీలు ఇక పై 180 రోజులకు బదులు 120 రోజులకు సమయం కుదింపు.

*ప్రధాన మంత్రి ఆత్మ నీర్భర్ స్వస్త్ భారత్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్ష 75 వేల కోట్ల రూపాయలు.

*మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు 20 వేల కోట్ల రూపాయలు కేటాయింపు.

*50 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్న సంస్థలను చిన్న సంస్థలు గా గుర్తిస్తూ చిన్న పరిశ్రమల నిర్వచనం.

*కొత్త ప్రాజెక్టుల్లో చేరాలి అంటే, ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి. అంతేకాక 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యం చేరాలి అంటే రెండంకెల వృద్ది తప్పనిసరి.

*ఒకే దేశం ఒకే రేషన్ తో సంచలన నిర్ణయం..దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలు. వలస కార్మికులకు ఎక్కడైనా రేషన్ తీసుకొనే అవకాశం. వేర్వేరు చోట్ల కుటుంబ సభ్యులు ఉంటే వాటాల ప్రకారం పంపిణీ.

*ఉన్నత విద్యా కమిశన్ ఏర్పాటు…వంద సైనిక పాటశాలల ఏర్పాటు, ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏక లవ్య పాటశాలల ఏర్పాటు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లలో మార్పు లతో పాటుగా, పరిశోధనా, నాణ్యత, మెరుగుదల కోసం జపాన్ తో ప్రత్యేక ఒప్పందం.

*గగన్ యాన్ మానవ సహిత ప్రయోగం కోసం ఏర్పాటు, అందుకుగానూ రష్యా లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాములు.

*కార్యాలయాల్లో రాత్రి పూట విధులు నిర్వర్తించే మహిళలకు రక్షణ, భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు

*దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్ ల ఏర్పాటు, 16.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల లక్ష్యం. వెయ్యి మండిలను ఈనాం తో అనుసంధానం, తేయాకు తోటల కార్మికుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయింపు.

*సామాజిక భద్రత పథకాల్లో వీధి వ్యాపారులను చేరుస్తూ కీలక నిర్ణయం. గోవా డిమాండ్ జూబ్లీ ఉత్సవాలకు 300 కోట్ల రూపాయల కేటాయింపు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి 1,500 కోట్ల రూపాయలు. డిజిటల్ విధానం లోకి జనాభా లెక్కలు.

*75 ఏళ్ళ వయసు దాటిన సీనియర్ సిటిజన్ల కి ఊరట. ఐటీ ఫైలింగ్ నుండి మినహాయింపు. ఫించన్, వడ్డీ ఆధారం గా ఫైలింగ్ ను మినహాయిస్తూ కీలక నిర్ణయం. పన్నుల వ్యవస్థ సరళీకరణ, వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు. 50 నుండి 10 లక్షల లోపు ఆదాయం కలిగిన వారి వివాదాల పరిష్కారానికి కమిటీ లకు అప్పీలు చేసుకొనే సౌకర్యం.

*ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మరోక ఏడాది పొడిగింపు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గృహాల కొనుగోలు పై రాయితీ లు.

*ఆదాయపు పన్ను ల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం తో పన్నులు యధాతధం గా కొనసాగనున్నాయి.