అఖిల భారత పిరికి సంఘానికి జగన్ అధ్యక్షుడు.. బుద్ధా వెంకన్న సెటైర్లు..!

Wednesday, March 24th, 2021, 02:27:19 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. అఖిల భారత పిరికి సంఘానికి జగన్ మొహన్ రెడ్డి అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు. హోదా కాదు కదా కేంద్రం నుండి కప్పు కాఫీ కూడా జగన్ రెడ్డి సాధించలేడని సెటైర్ వేశారు. అయితే ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చేసిందని గుంపుగా 22 మంది ఎంపీలు ఉండి అసలు ఏం లాభమని బుద్ధా ప్రశ్నించారు. అయితే మెడలు వంచి హోదా సాధిస్తా అని తొడకొట్టిన జగన్ రెడ్డి ఎక్కడ అని, కనీసం నోరిప్పి అడిగే ధైర్యం కూడా లేదయ్యా జగన్ రెడ్డీ నీకు అని బుద్ధా వెంకన్న విమర్శించారు.