చంద్రబాబును టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే – బుద్ధా వెంకన్న

Thursday, January 7th, 2021, 06:37:08 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిందని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబును టచ్ చేస్తే రాష్ట్ర అగ్ని గుండంలా మారుతుందని, చంద్రబాబును అరెస్ట్ చేస్తే జగన్‌ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బుద్ధా వెంకన్న అన్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలతో పాటు దేవుళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయిందని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీ వైసీపీ కార్యకర్తలా మారారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం ఘటనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వీటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ నేతలంతా గవర్నర్‌ని కోరినట్టు తెలిపారు.