జగన్‌కి సలహా ఇచ్చిన బుద్ధా వెంకన్న.. ఏ విషయంలో అంటే?

Saturday, March 20th, 2021, 01:47:25 AM IST


ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓ సలహా ఇచ్చారు. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై జరుగుతున్న సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా సందిస్తూ రెండేళ్లు వెతికినా ఆధారాలు దొరకలేదని కోర్టుకి చెప్పారు మరి బయట కేసంటూ డ్రామాలేందుకు జగన్ గారు అని ప్రశ్నించారు. అయితే మొట్టికాయలు జగన్ గారికి కొత్త కాదయా! రెడ్డి గారి ఫిర్యాదుతో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసిన రోజే అది దొంగ కేసు అని తేలిపోయిందని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.

అయితే అమరావతిపై విషం కక్కడం, చంద్రబాబు గారిపై కక్ష సాధింపు వంటివి పక్కన పెట్టి సన్న బియ్యం డోర్ డెలివరీపై దృష్టి పెడితే 151 మంది గెలిచినందుకు కనీసం అర్థముంటుందని, మీ నాన్న గారికే సాధ్యం కాని పనుల గురించి ఎక్కువ ఆలోచించి తల బొప్పి కట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని ఇదే నేను మీకు ఇచ్చే సలహా అంటూ బుద్ధా వెంకన్న అన్నారు.