విజయసాయిరెడ్డికి ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ – బుద్ధా వెంకన్న

Thursday, July 16th, 2020, 08:17:07 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్వీట్ చేసిన సాయిరెడ్డి గారికి దమ్ముంటే అమరావతిలో చంద్రబాబుగారు కట్టిన భవనం పైనుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలని, మూడు ముక్కలాట మొదలెట్టి ఒక్క ఇటుక పెట్టలేదు. మీరా విశాఖలో అద్భుత నగరాన్ని కట్టేది అని ప్రశ్నించారు.

అయితే బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జనాన్ని పెట్టినంత వీజీ కాదు రాజధాని నిర్మాణం అంటే సాయిరెడ్డి సాబ్. ఎప్పుడు వస్తారో చెబితే మీడియాతో సహా బిల్డింగ్ కింద వెయిట్ చేస్తానంటూ సవాల్ చేశారు.