ఆధారాలు కొట్టు, రెండెకరాలు పట్టు.. విజయసాయి రెడ్డికి బుద్ధా కౌంటర్..!

Wednesday, March 3rd, 2021, 01:53:36 AM IST


వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. విశాఖలో బుద్ధా వెంకన్న రెండెకరాల భూమిని కబ్జా చేసాడని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన బుద్ధా వెంకన్న విశాఖలో నేను రెండెకరాల భూమి కబ్జా చేసానని ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయసాయి రెడ్డి ఆరోపించారని, ఆ రెండెకరాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే రెండెకరాలని జగన్ పేరు మీద లేదా వైకాపా పేరు మీద రాయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బుద్ధా అన్నారు. అంతేకాదు ఆన్సర్ చెప్పు, గిఫ్ట్ పట్టు అనేలా ఆ ఆధారాలు మీడియాకి చూపించండి రెండెకరాలు తీసుకోండి. మీ భూదాహానికి రెండెకరాలు చిన్న విషయమే అయినా ఆధారాలు చూపిస్తే చిరు కానుకగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.