దొంగ లెక్కలు చెప్పకు.. విజయసాయిపై రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్..!

Tuesday, February 23rd, 2021, 01:30:35 AM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్మూత్ కౌంటర్ ఇచ్చారు. దొంగ లెక్కలు చెప్పటానికి, ఇది నువ్వు పెట్టిన సూట్ కేసు కంపెనీ కాదు విజయసాయి రెడ్డి అని, కేంద్రం ముందు మెడలు వంచేసి, నీటి నిల్వ సామర్ధ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించి, మీ దొంగల బ్యాచ్ చేస్తున్న పనులు అందరికీ తెలుసని, 41.15 మీటర్లకు పోలవరం నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్ళు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. అంతేకాదు అలా చేస్తే అసలు విశాఖ జిల్లా ప్రజల అవసరాలు ఎలా తీరుతాయని, పోలవరం నుండి సన్న బియ్యం వాహనాల్లో నీరు తరలిస్తారా అని నిలదీశారు. దొంగ లెక్కలు చెప్పకు, దొంగ లెక్కల రెడ్డి లేకపోతే ప్రజలు మరోసారి పాదరక్షల సన్మానం చేస్తారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.