పిల్లలు పెట్టుకునే బెల్టుకి పార్టీ రంగులు.. విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్..!

Monday, October 12th, 2020, 03:34:56 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దోచిన 43 వేల కోట్లు ఇచ్చి వైఎస్ జగన్ మావయ్య అయ్యాడా విజయసాయి రెడ్డి గారు అని ప్రశ్నించారు. దొంగ మామ ఇచ్చిన బ్యాగ్ స్కూల్ తెరవకముందే చిరిగిపోయింది అని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో ఉన్న సైకిళ్ల పంపిణీ ఎత్తేశావ్,పేద విద్యార్థులకు వరంలా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఎత్తేసారని అన్నారు.

పిల్లలు పెట్టుకునే బెల్టుకి పార్టీ రంగులు వేసుకునే చిల్లర బ్యాచ్ మీరు. 17 నెలలకే నీ అల్లుడు హ్యాండ్స్ అప్. 25 ఏళ్ళు జైలు జీవితం ఖాయమే సాయి రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. అంతకు ముందు విజయసాయి రెడ్డి జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను కక్కేస్తున్నారు పచ్చనేతలు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే ఉండండి అంటూ ట్వీట్ చేశారు.