వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరో అల్టీమేట్ కౌంటర్ ఇచ్చారు. లక్ష కోట్ల అవినీతి కేసులో అరెస్టు భయంతోనే ఢిల్లీకి పదేపదే పరిగెడుతున్నట్టు తాడేపల్లి గుసగుస అని, 43 కోట్ల దోపిడీ అని సీబీఐ తేల్చేసిందని, మిగిలిన లెక్కలు ఈడీ దగ్గర ఉన్నాయని అన్నారు. క్విడ్ ప్రో కో, సూట్ కేసు కంపెనీలు, హవాలా సూత్రధారి కోసమే గజ దొంగ పదం పుట్టిందేమో అని అన్నారు.
అయితే అంతకు ముందు ట్విట్టర్ ద్వారా ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయని, సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట అంటూ ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుందని విజయసాయి రెడ్డి అన్నారు.
లక్ష కోట్ల అవినీతి కేసులో అరెస్టు భయంతోనే ఢిల్లీకి పదేపదే పరిగెడుతున్నట్టు తాడేపల్లి గుసగుస.43 కోట్ల దోపిడీ అని సీబీఐ తేల్చేసింది. మిగిలిన లెక్కలు ఈడీ దగ్గర ఉన్నాయి. క్విడ్ ప్రో కో, సూట్ కేసు కంపెనీలు, హవాలా సూత్రధారి కోసమే
గజ దొంగ పదం పుట్టిందేమో.— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 13, 2020