అడ్డంగా దొరికిపోయారు.. విజయసాయిపై బుద్ధా వెంకన్న కామెంట్స్..!

Thursday, February 11th, 2021, 01:58:07 AM IST


వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా అల్టీమేట్ కామెంట్స్ చేశారు. మైక్ ముందు కారాగారం అంటూ ఎన్ని పోసుకోలు కబుర్లు చెప్పినా పోస్కో కంపెనీతో కలిసి జగన్ రెడ్డి చేసుకున్న డీల్ బయటపడకుండా ఆగదు సాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్లానింగ్ అంతా మీ స్కెచ్ ప్రకారమే జరుగుతోందని స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాజ్యసభ సాక్షిగా బయటపెట్టారని బుద్ధా వెంకన్న అన్నారు.

అంతేకాదు స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో కంపెనీ ఏర్పాటు, ఆర్ఐఎన్ఎల్-పోస్కో మధ్య ఒప్పందం, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలిసి డీల్ ఒకే చేసుకోవడం అన్నీ విషయాలు ఆన్ రికార్డ్ బయటపడ్డాయి. అడ్డంగా దొరికిపోయారని ఇక స్టీల్ ప్లాంట్ ముందు వైకాపా డ్రామాలు ఆపి ప్రజల్ని క్షమాపణ కోరండి. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలి అనుకుంటున్న మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టడం ఖాయం సాయిరెడ్డి అని అన్నారు.