ప్రత్యేక హోదా తలుచుకుంటే జగన్‌కి తడిసిపోతుంది – బుద్ధా వెంకన్న

Friday, October 9th, 2020, 07:14:58 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని తొడలు చరిచి, ఇప్పుడు కేసుల కోసం మెడలు దించుకొని కాళ్ళు నాకుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా తలుచుకంటే జగన్‌కు చంచలగూడ జైలు గుర్తుకు వచ్చి తడిసిపోతోందని ఎద్దేవా చేశారు. ఈ యూ టర్న్ లు చూసి ఊసరవెల్లులు ఆత్మహత్య చేసుకొంటున్నాయని, ప్రజలు మిమ్మల్ని పాతాళం కంటే లోపల పాతేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

అంతకు ముందు విజయసాయి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనను తాను పాతాళంలోకి గిరాటేసుకోవడంలో బాబు గారిని మించిన అనుభవజ్ఞుడు ప్రపంచంలోనే లేరు. రఫేల్ విమానాల కొనుగోళ్లలో ప్రధాని 59 వేల కోట్ల స్కాముకు పాల్పడ్డారని దుమ్మెత్తిపోశాడు. అదే నోటితో రఫేల్ ఫైటర్లతో దేశం శక్తి పెరిగిందని కొనియాడటం ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేయడం కాక మరేమిటి అని అన్నారు.